.

.

నటసామ్రాట్ అక్కినేని అస్తమయం

Akkineni passes away

మహా నటుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, 72  ఏళ్లుగా సిని పరిశ్రమలో వెలుగొందిన తారా నెల రాలింది. నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (90) ఇక లేరు. అయన  బుధవారం తెల్లవారుజాము 2.45 గంటలకు హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.  కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న అక్కినేని తెల్లవారుజాము 1.30కు తీవ్ర అస్వస్థతతో గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిగా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి చాలావరకు విషమించింది. వైద్యులు గంటకు పైగా అన్నిరకాలుగా ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. అక్కినేని తన సుదీర్ఘ నట జీవితంలో 256 సినిమాల్లో నటించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు , పద్మవిభూషణ్  వంటి పలు అవార్డులు ఆయన్ను వరించాయి. అయన మృతి పట్ల పలువురు సిని ప్రముఖులు తమ ప్రగాడ సంతాపాన్ని తెలియచేసాడు.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment