.

.

aatadukundaam raa talkie compleeted

ఆటాడుకుందాం..రా టాకీ పూర్తి 

కాళిదాసు, కరెంట్‌, అడ్డా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీ జి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఆటాడుకుందాం.. రా'(జస్ట్‌ చిల్‌). ఈ చిత్రానికి సంబంధించి పాటలు మినహా టాకీ, యాక్షన్‌ పార్ట్స్‌ పూర్తయ్యాయి. ఈ చిత్రంలోని కొన్ని ముఖ్యమైన కామెడీ సీన్స్‌ కోసం 60 లక్షల రూపాయల భారీ వ్యయంతో అన్నపూర్ణ సెవన్‌ ఎకర్స్‌లో టైమ్‌ మెషీన్‌ సెట్‌ను వేశారు. ప్రస్తుతం ఈ సెట్‌లో బ్రహ్మానందం కాంబినేషన్‌లో కొన్ని కామెడీ సీన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవన్‌ ఎకర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో సుశాంత్‌, డైరెక్టర్‌ జి.నాగేశ్వరరెడ్డి, రచయిత, శ్రీధర్‌ సీపాన, నిర్మాతలు చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల పాల్గొన్నారు. హీరో సుశాంత్‌ మాట్లాడుతూ - ''శ్రీధర్‌ సీపాన మంచి కథ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత మంచి కథ సెలెక్ట్‌ చేసుకొని ఈ సినిమా చేస్తున్నాను. ఈ క్యారెక్టర్‌ నాకు చాలా కొత్తగా వుంటుంది. నాగేశ్వరరెడ్డిగారు ఎంటర్‌టైన్‌మెంట్‌ సీన్స్‌ని బాగా చిత్రీకరించారు. బ్రహ్మానందంగారితో నేను చేసిన కామెడీ సీన్స్‌ అన్నీ ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తాయి. అన్నివర్గాల ప్రేక్షకులు మెచ్చే సినిమా ఇది. అందరూ బాగా ఎంజాయ్‌ చేస్తారు'' అన్నారు.   దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ - ''ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్‌ అందరికీ కనెక్ట్‌ అవుతుంది. సుశాంత్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ యాప్ట్‌ అయ్యే కథ ఇది. శ్రీధర్‌ సీపాన అద్భుతమైన కథ ఇచ్చాడు. ఈ కథ విన్నప్పుడే మేం చాలా ఎంజాయ్‌ చేశాం. సెట్‌లో సీన్స్‌ చిత్రీకరిస్తున్నప్పుడు కూడా అంతే ఎంజాయ్‌ చేస్తున్నాం. బ్రహ్మానందంగారు ఈ సినిమా కోసం 15 రోజులు వర్క్‌ చేశారు. జనరల్‌గా హీరో కోసం లేదా, విలన్‌ డెన్‌ కోసం, పాటల కోసం భారీ సెట్స్‌ వేస్తారు. ఈ సినిమాలో కామెడీ సీన్‌ కోసం స్పెషల్‌గా 60 లక్షల ఖర్చుతో టైమ్‌ మెషీన్‌ సెట్‌ వేయడం నాకు తెలిసి ఇదే ఫస్ట్‌ టైమ్‌. ఈ కామెడీ సీన్స్‌ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. సుశాంత్‌ కాళిదాసు చిత్రంలో కామెడీని బాగా పండించాడు. ఈ సినిమాలో కూడా కామెడీ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. కెమెరామెన్‌ శివ చాలా ఎక్స్‌లెంట్‌ ఫోటోగ్రఫీ అందించారు. అనూప్‌ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ అందిస్తున్నారు. చిన్నసినిమా అయినా చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చింతలపూడి శ్రీనివాసరావుగారు, నాగసుశీలగారి కోఆపరేషన్‌తో సినిమాని చాలా ఫాస్ట్‌గా ఫినిష్‌ చెయ్యగలిగాము. ఈ బేనర్స్‌లో సినిమా చెయ్యడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది'' అన్నారు.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment