.

.

gopichand oxyzen movie start

గోపీచంద్‌ ఆక్సిజన్‌ ప్రారంబం 

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్న 'ఆక్సిజన్‌' చిత్రం షూటింగ్‌ పూజా కార్యక్రమాలతో ఈరోజు చెన్నయ్‌లోని శ్రీవిశ్వరూపా సాయిబాబా టెంపుల్‌లో ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమంలో హీరో గోపీచంద్‌, డైరెక్టర్‌ జోతికృష్ణ, నిర్మాణ పర్యవేక్షకులు ఎ.ఎం.రత్నం, నిర్మాత ఎస్‌.ఐశ్వర్య, సినిమాటోగ్రాఫర్‌ వెట్రి పాల్గొన్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు జోతికృష్ణ తెలియజేస్తూ - ''ఇది ఒక ఫాస్ట్‌ పేస్డ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. ఈరోజు పూజా కార్యక్రమాలతో మా 'ఆక్సిజన్‌' చిత్రాన్ని ప్రారంభించాము. ఈ చిత్రంలో జగపతిబాబుగారు ఎంతో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అలాగే ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. జనవరి నుంచి ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది'' అన్నారు. 
ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌, జగపతిబాబు, కిక్‌ శ్యామ్‌, రాశిఖన్నా, అను ఇమ్మానుయేల్‌, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్‌: సిల్వ, ఆర్ట్‌: మిలన్‌, నిర్మాణ పర్యవేక్షణ: ఎ.ఎం.రత్నం, నిర్మాత: ఎస్‌.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment