.

.

express raja audio on dec 19

19న  ఎక్స్‌ప్రెస్ రాజా పాటలు 

 'రన్ రాజా రన్; , 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' వంటి సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ ఎనర్జిటిక్ శ‌ర్వానంద్‌ హీరోగా, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి తొలి చిత్రంతోనే బంపర్ హట్ అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో, సుర‌భి క‌థ‌నాయిక‌గా, మిర్చి, రన్ రాజా రన్, జిల్, భలే భలే మగాడివోయ్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో క్లీన్ స్మాషింగ్ హిట్ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ , ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా. ఇటీవలే రిలీజ్ చేసిన చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సక్సెస్ ఫుల్ టీం నుంచి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులతో పాటు. చిత్ర పరిశ్రమలో ఎక్స్ ప్రెస్ రాజా చిత్రానికి ఊహించని విధంగా స్పందన లభించింది. ఇదే ఊపును కంటిన్యూ చేస్తూ. ఈరోజు ఎక్స్ ప్రెస్ రాజా చిత్రంలోని ఒక సాంగ్ని విడుదల చేశారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన అద్భుతమైన పాటలను ఈనెల 19న అభిమానులు, సినీ పెద్దల సమక్షంలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.  
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..మా బ్యాన‌ర్ లో ర‌న్ రాజా రన్ చిత్రంతో శ‌ర్వానంద్ మా కాంబినేష‌న్ సూప‌ర్‌హిట్ అయిన విష‌యం తెలిసిందే. మ‌ళ్ళి మా కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రానికి సంభందించిన ఫ‌స్ట్ లుక్ నుండి టీజ‌ర్ వ‌ర‌కూ హ్యూజ్ రెస్పాన్స్ రావ‌టం చాలా ఆనందంగా వుంది.  వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో సూప‌ర్‌డూపర్ స‌క్స‌స్ ని అందుకున్న ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధి ఈచిత్రానికి ద‌ర్శ‌కుడు. సుర‌భి క‌థానాయిక‌. అలానే ఈరోజు మా చిత్రంలోని ఆడియో లో ఓ సాంగ్ ని విడుద‌ల చేశాము. అలాగే డిసెంబ‌ర్ 19 న అభిమానుల స‌మ‌క్షంలో ఈచిత్రం యెక్క ఆడియోని విడుద‌ల చేస్తున్నాము. చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేస్తున్నాము. మా బ్యాన‌ర్ నుండి ఎలాంటి చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఎక్స్‌పెక్ట్ చేస్తారో ఆరేంజి లో మా ఎక్స్‌ప్రెస్ రాజా వుంటుంది. అని అన్నారు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment