.

.

anubandam movie launch

అనుబంధం మూవీ ప్రారంభం 

శ్రీ సాయి సినిమాస్‌ బ్యానర్‌పై యం. మహేంద్రవర్మ సమర్పణలో సాయి, నాగుల్‌ మీర నిర్మాతలుగా.. సత్యనారాయణ సజ్జనపు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ''అనుబంధం''. 'శాటిలైట్‌తో' అనేది ఉపశీర్షిక. సారథి, నజీర్‌లు సహనిర్మాతలు. ఈ చిత్రం డిశంబర్‌ 10వ తేదీన ముహుర్తం జరుపుకుంది. ప్రముఖ తత్వవేత్త శ్రీశ్రీ రామశివ చైతన్యంగారు టీమ్‌ని ఆశీర్వదించి చిత్రానికి శ్రీకారం చుట్టారు. దర్శకుడు నగేష్‌ నారదాశి దర్శకనిర్మాతలకు శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సత్యనారాయణ సజ్జనపు మాట్లాడుతూ..''నేటి యువతరంలోని అనబంధాలను, శాటిలైట్‌తో వాటి సంబంధాలను కొత్తదనంతో చూపించే వైవిధ్యభరిత చిత్రమే 'అనుబంధం'. నిర్మాతలు సాయి, నాగుల్‌ మీర గార్లు..ఈ స్టోరీ విని ఎంతో ఆసక్తిని కనబర్చారు. వెంటనే ఈ చిత్రం తెరకెక్కిద్దామని ఇలా ముందుకొచ్చారు. నా కథ నమ్మి, ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన వారికి ముందుగా ధన్యవాదాలు. అందరినీ అలరించే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి..'' అని అన్నారు. 
నిర్మాతలు మాట్లాడుతూ..''ముందుగా మా ఈ 'అనుబంధం' చిత్రానికి శ్రీకారం చుట్టిన శ్రీశ్రీ రామశివ చైతన్యం గార్కి, మా శ్రేయోభిలాషి, దర్శకుడు నగేష్‌ నారదాశి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. సత్యనారాయణ సజ్జనపు చెప్పిన కథ మాకు ఎంతగానో నచ్చింది. అందుకే ఈ సినిమా చేయాలని ముందుకొచ్చాము. ప్రముఖ హీరో నటించే ఈ చిత్రంలో మిగిలిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. జనవరి 20 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది..'' అని అన్నారు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment