.

.

jathakalise audio released

జతకలిసే ఆడియో విడుదల

అశ్విన్తేజస్వి హీరో హీరోయిన్లుగా ఓంకార్ సమర్పణలో   యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం జత కలిసే.  దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుమాటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'రేపటి దర్శకులుఅనే కార్యక్రమంలో టాప్ టెన్ లో ఒకడిగా నిలిచిపరుచూరి బ్రదర్స్చిన్ని కృష్ణ వంటి స్టార్ రైటర్స్రామ్ గోపాల్ వర్మగుణ శేఖర్ వంటి క్రేజీ డైరెక్టర్స్ తో  వర్క్ చేసిన రాకేష్ శశి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి సినిమాను గ్రాండ్ లెవల్లో డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు.  విక్కి,సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్ లోని జె.ఆర్.సి సెంటర్ లో నిర్వహించారు. బిగ్ సీడీనిఆడియో సీడీలను రాజమౌళి ఆవిష్కరించారు. తొలి సీడీని యం.యం.కీరవాణి అందుకున్నారు. థియేట్రికల్ ట్రైలర్ ను కూడా కీరవాణి విడుదల చేశారు.
ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి మాట్లాడుతూ ‘’ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఫ్రెండ్ ఫిప్ కోసం నిర్మాత‌గారు ఈ సినిమాను నిర్మించారు. సాయికొర్ర‌పాటిగారు సినిమాకు అండ‌గా నిల‌బ‌డ్డారు. ఇలాంటి మంచి సినిమాల‌ను ఆయ‌న ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను. సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు. సాయికొర్ర‌పాటి మాట్లాడుతూ ‘’రాజుగారి గ‌ది చిత్రంలో హీరోగా ప‌రిచ‌యం అయిన అశ్విన్ ఈ చిత్రంతో స్టార్ హీరోల లిస్టులో చేరాలి. క‌చ్చితంగా సినిమా పెద్ద హిట్ట‌వుతుంది’’ అన్నారు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

1 comments:

  1. PicoBet Review - An Open-To-Earn Crypto Casino
    PicoBet titanium hair is one of the best ray ban titanium crypto raw titanium casinos. The titanium muffler casino allows players to wager their money, but is it reliable? power supply titanium PicoBet.com has a

    ReplyDelete