.

.

త్వరలో ఓకే బంగారం పాటలు

Ok bangaram songs soon


సంచలన దర్శకుడు మణిరత్నం దర్శకత్వం లో దుల్కర్‌ సల్మాన్‌, నిత్యామీనన్‌ జంటగా మద్రాస్‌ టాకీస్‌ అండ్‌ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌పై   రూపొందుతున్న ‘ఓకే కన్మణి’ చిత్రాన్ని ‘ఓకె బంగారం’గా అగ్ర నిర్మాత దిల్‌ రాజు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా పరిచయం అవుతున్న దుల్కర్‌ సల్మాన్‌కు తెలుగులో ప్రముఖ కథానాయకుడు నాని డబ్బింగ్‌ చెబుతున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘‘నేను మణిరత్నంగారి వీరాభిమానిని. ఆయన అడగడంతో పాటు, దిల్‌రాజుగారి మీద ఉన్న గౌరవంతో తెలుగులో హీరో పాత్ర కు డబ్బింగ్‌ చెప్పేందుకు అంగీకరించాను. ‘ఓకే బంగారం’ చిత్రానికి డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు ‘సఖి’ కంటే ఈ సినిమా గొప్పగా వుంటుందని అనిపించింది. ఓ మంచి చిత్రాన్ని త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు మణిరత్నంగారు, దిల్‌రాజుగారు అందించబోతున్నారు. ఈ చిత్రం ఆడియోను మార్చి నెలాఖరులో, ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఈ సినిమా ‘సఖి’ని మించి భారీ విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అని అన్నారు. మద్రాస్‌ టాకీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ అందిస్తున్న ఈ చిత్రానికి పాటలు: సీతారామ శాస్త్రి, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్. శిరీష్‌, లక్ష్మణ్‌ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment