.

.

maama manchu alludu kanchu audio on 28 nov

28న మామ మంచు అల్లుడు కంచు పాటలు 


కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబుఅల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం మామ మంచు..అల్లుడు కంచు’. డా. మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణమీనా నటిస్తున్నారు. అల్లరి నరేష్ కు జతగా పూర్ణ నటిస్తుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని నవంబర్ 28న నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. అలాగే అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా...  నిర్మాత మంచు విష్ణు మాట్లాడుతూ ‘’నాన్నగారు నటిస్తున్నమామమంచు- అల్లుడు కంచు సినిమా ఆయన హీరోగా నటించిన 181వ చిత్రం. అలాగే ఈ చిత్రంలో అల్లరి నరేష్,పూర్ణ నటిస్తున్నారు. అల్లరి నరేష్ కు ఈ చిత్రం 50వ సినిమా. డిఫరెంట్ కాంబినేషన్ లో అవుటండ్ అవుంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. అచ్చు మంచి మ్యూజిక్ ను అందించారు. నవంబర్ 28న ప్రముఖుల సమక్షంలో ఈ చిత్ర ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం.  డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సినిమాను చక్కగా డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా బాగా వచ్చింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. 

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment