.

.

cheekati rajyam special preview

చీక‌టిరాజ్యం ఐమ్యాక్స్‌ స్పెషల్ ప్రివ్యూ షో 

లోకనాయకుడు కమల్‌హాసన్‌ కథానాయకుడిగా రాజేష్‌.ఎం.సెల్వ దర్శకత్వంలో రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ - శ్రీ గోకుళం మూవీస్‌  సంయుక్తంగా నిర్మించిన సినిమా 'చీకటిరాజ్యం'. త్రిష, మధుశాలిని కథానాయికలుగా నటించారు. ప్రకాష్‌రాజ్‌ కీలకపాత్రధారి. ఈ సినిమా న‌వంబ‌ర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజై భారీ ఓపెనింగ్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఐమ్యాక్స్‌లో గురువారం సాయంత్ర జ‌రిగిన సెల‌బ్రిటీ ప్రివ్యూ షోకి  క‌ళా బంధు, రాజ్య‌స‌భ స‌భ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి, తెలంగాణ రాష్ర్ట ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, మేటి న‌టి `బ్లూక్రాస్` అధ్య‌క్షురాలు అక్కినేని అమ‌ల‌, యంగ్ హీరోలు రానా ద‌గ్గుబాటి, నిఖిల్‌, నాని, రాహుల్ రవీంద్ర‌న్‌, యంగ్ డైరెక్ట‌ర్ మారుతి, యువ‌క‌థానాయికలు ర‌కూల్ ప్రీత్‌సింగ్‌, రెజీన‌, సైజ్ జీరో డైరెక్ట‌ర్ కె.ఎస్‌.ప్ర‌కాష‌రావు, ఆయ‌న స‌తీమ‌ణి క‌నిక  అటెండ‌య్యారు. చీక‌టిరాజ్యం యూనిట్ నుంచి యూనివ‌ర్శ‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్, గౌత‌మి, త్రిష‌, ప్ర‌కాష్‌రాజ్‌, న‌టుడు సంప‌త్ త‌దిత‌రులు ప్రివ్యూ వీక్షించారు. అనంత‌రం చీక‌టిరాజ్యం సినిమా గురించి అతిధులంతా ముచ్చ‌టించారు.  టి.సుబ్బిరామిరెడ్డి  మాట్లాడుతూ -``చీక‌టిరాజ్యం ఫెంటాస్టిక్ మూవీ. క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన గ‌త సినిమాల‌న్నిటికంటే డిఫ‌రెంట్ మూవీ. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం ర‌క్తిక‌ట్టించింది. యూనివ‌ర్శ‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ పెర్ఫామెన్స్ మైండ్ బ్లోవింగ్‌. మ‌రోసారి క‌మ‌ల్ పూర్తి స్థాయిలో విజృంభించి న‌టించారు.  తెలంగాణ రాష్ర్ట ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ -``లెజెండ‌రీ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన చీక‌టిరాజ్యం మ‌రో ఇంట్రెస్టింగ్ మూవీ. థ్రిల్ల‌ర్ ఫార్మాట్‌లో అత్యద్భుత‌మైన డ్రామా ఉన్న మూవీ ఇది. క‌మ‌ల్‌హాస‌న్ న‌ట‌న అద్భుతం. ఆయ‌న‌తో క‌లిసి ఈ సినిమాని వీక్షించే అవ‌కాశం రావ‌డం చాలా థ్రిల్లింగ్‌. క‌మ‌ల్‌హాస‌న్‌తో పాటు ప్ర‌కాష్‌రాజ్‌ న‌ట‌న అస‌మానంగా ఆక‌ట్టుకుంది. బిజీ షెడ్యూల్‌లోనూ ఈ మూవీ చూశాను. చాలా థ్రిల్ క‌లిగించింది. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ న‌చ్చే చిత్ర‌మిది`` అన్నారు. క‌మ‌ల్‌హాస‌న్ మాట్లాడుతూ -`` తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త థ్రిల్‌నిచ్చే సినిమా -చీక‌టిరాజ్యం. ఓ డిఫ‌రెంట్ మూవీ చూశామ‌న్న సంతోషాన్నిస్తుంది. ఇప్ప‌టికే సినిమా చూసిన‌వారంతా అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసిస్తున్నారు. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. తెలుగు ప్రేక్ష‌కులు న‌న్ను ఎంత‌గానో ఆద‌రిస్తున్నందుకు ప్ర‌త్యేకించి కృత‌జ్ఞ‌త‌లు. చీక‌టిరాజ్యం ఓ ఫాస్ట్ ఫేస్ థ్రిల్ల‌ర్‌. ఇది అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ కి గురిచేసే ఫాస్ట్ ఫేస్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. థియేట‌ర్ల‌లో చూసి ఆస్వాదించండి. ఇలాంటి విల‌క్ష‌ణ‌మైన క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ల‌తో మునుముందు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాను`` అన్నారు.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment