.

.

premam movie on dec 3

 ప్రేమమ్‌  కథ నాకు ఎంతో నచ్చింది

- అక్కినేని నాగ చైతన్య  
 ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకుంటూ సక్సెస్‌ఫుల్‌ హీరోగా దూసుకెళ్తున్న మహానటుడు అక్కినేని మనవడు, కింగ్‌ నాగార్జున తనయుడు యువసామ్రాట్‌ నాగచైతన్య  ప్రేక్షకులు, అక్కినే అభిమానులు ఆదరించడం వల్ల హీరోగా నా కెరీర్‌ చాలా హ్యాపీగా వుంది. ఏమాయ చేసావె, 100% లవ్‌, తడాఖా, ఒక లైలా కోసం చిత్రాలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. వాటన్నింటినీ మించి మనం చిత్రం అన్నివిధాలా నాకు సంతృప్తి కలిగించిన విజయాన్ని అందించింది. అంతేకాదు తాతగారితో, నాన్నతో కలిసి నటించడం అన్నది ఓ మంచి అనుభూతి కలిగించింది. మనం నా కెరీర్‌లో ఓ మెమరబుల్‌ ఫిలిం అయింది. ప్రేక్షకులు, అభిమానులు మెచ్చే వైవిధ్యమైన సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా ఎయిమ్‌. అన్నపూర్ణ స్టూడియో బేనర్‌లో నిర్మించిన ఒక లైలా కోసంలో హీరోగా నటిస్తూనే ప్రొడక్షన్‌ కూడా చూసుకున్నాను. నిర్మాతగా అందరికీ నచ్చే సినిమాలు చెయ్యాలన్నది నా యాంబిషన్‌.  ఏమాయచేసావెతో రొమాంటిక్‌ హీరోగా నాకు ఇమేజ్‌ తెచ్చిన గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో చేస్తున్నాను. ఆల్‌మోస్ట్‌ పూర్తయింది. ఫస్ట్‌ హాఫ్‌ ఓ రోడ్‌ ట్రిప్‌లో జరిగే లవ్‌స్టోరీ. సెకండాఫ్‌ యాక్షన్‌కి వెళ్తుంది. ఈ యాక్షన్‌ చాలా నేచురల్‌గా వుంటుంది. హీరో క్యారెక్టర్‌కి ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. గౌతమ్‌ మీనన్‌ ఈ సినిమాని బాగా డిజైన్‌ చేసారు. ఏమాయ చేసావె తర్వాత ఎ.ఆర్‌.రెహమాన్‌గారు నాకు మ్యూజిక్‌ చెయ్యడం వెరీ హ్యాపీ. మ్యూజిక్‌కి ఈ సినిమాకి చాలా పెద్ద ఎస్సెట్‌. పొయెటిక్‌గా టైటిల్స్‌ పెట్టే గౌతమ్‌ మీనన్‌గారు ఈ సినిమాకి పెట్టిన టైటిల్‌ అందరికీ నచ్చింది. సినిమా చూసాక సాహసం శ్వాసగా సాగిపో టైటిల్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ పర్‌ఫెక్ట్‌ అంటారు. కోన వెంకట్‌, రావి రవీంద్రరెడ్డి కాంప్రమైజ్‌ అవకుండా సినిమా చేస్తున్నారు. కార్తికేయ డైరెక్టర్‌ చందు మొండేటితో సినిమా చేద్దామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. నాకు కార్తికేయ బాగా నచ్చింది. అప్పటి నుంచి నేను చందుతో ట్రావెల్‌ అవుతున్నాను. ఓ కథ కూడా అనుకున్నాము. ఈలోగా మలయాళంలో ప్రేమమ్‌ అనే లవ్‌స్టోరీ రిలీజ్‌ అయి సూపర్‌హిట్‌ అయింది. ఈ కథ నాకు బాగా నచ్చి రీమేక్‌ చేద్దామన్నాను. స్కూల్‌లో వున్నప్పుడు ప్రేమ, కాలేజీలో వున్నప్పడు ప్రేమ, మెచ్యూర్డ్‌ ఏజ్‌లో పెళ్ళి చేసుకున్నప్పుడు వుండే ప్రేమ.. వీటన్నింటి మధ్య వుండే వేరియేషన్‌ని హీరో క్యారెక్టర్‌ నుంచి చెప్పే అల్టిమేట్‌ లవ్‌స్టోరీ ఇది. లైఫ్‌ జర్నీలో ఈక్యారెక్టర్‌ మారే తీరు చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే అనుభవాలు ఈ హీరో పాత్రలో వుంటాయి. ఈ సినిమాని ఎంతో ప్యాషన్‌తో వంశీ, చందు మొండేటి చేస్తున్నారు. ఈ సినిమాకి తెలుగులో ఇంకా పేరు నిర్ణయించలేదు'' అన్నారు యువసామ్రాట్‌ నాగచైతన్య. 
 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment