.

.

killing veerappan on dec 4

కిల్లింగ్‌ వీరప్పన్‌ ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్ 

సంచ‌న‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకృష్ణా క్రియేషన్స్‌ బ్యానర్‌పై జి.ఆర్‌.పిక్చర్స్‌జెడ్‌త్రీ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా రూపొందిన చిత్రం కిల్లింగ్‌ వీరప్పన్‌’. సందీప్‌ భరద్వాజ్‌ టైటిల్‌ ప్రాతలో శివరాజ్‌కుమార్‌రాక్‌లైన్‌ వెంకటేష్‌పరుల్‌యాదవ్‌ ప్రధాన తారాగణంగా న‌టించారు.  బి.వి.మంజునాథ్‌ఇ.శివప్రకాష్‌,బి.ఎస్‌.సుధీంద్ర నిర్మాతలుగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. డిసెంబ‌ర్ 4న ఈచిత్రం తెలుగుత‌మిళంక‌న్న‌డ బాషల్లో విడుద‌ల‌వుతుంది. . ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయు సమావేశంలో...రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ ‘‘తొంబై ద‌శ‌కంలో క‌ర్ణాట‌క‌,త‌మిళ‌నాడుఆంధ్ర రాష్ట్రాల‌కు చెందిన పోలీసుల‌కు వీరప్పన్‌ చంపడానికి 20 సంవత్సరాల స‌మ‌యం పట్టింది. అందుకు చాలా కార‌ణాలున్నాయి. అత‌ను అడ‌విలోనే ఉండ‌టంపోలీసులుటాస్క్ ఫోర్స్ మ‌ధ్య స‌మ‌న్య‌యం లేక‌పోవ‌డం వంటి కార‌ణాలున్నాయి. ఇక వీర‌ప్ప‌న్ సినిమాను తీయ‌డానికి ముందు నేను అతని గురించి స్టడీ చేశాను. అతని భార్య ముత్తులక్ష్మిని క‌లుసుకున్నాను. వీర‌ప్ప‌న్ లైఫ్‌లో చాలా అధ్యాయాలున్నాయి. అందులో ఎమోష‌న‌ల్ చాఫ‌ర్ట్ కూడా ఉంది. ఇలాంటి ఓ విల‌లక్ష‌ణ‌మైన వ్య‌క్తి గురించి కిల్లింగ్‌ వీరప్పన్‌’ లాంటి సినిమా చేయడం డిఫరెంట్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది. సినిమా అంతా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కొన‌సాగుతుంది. వీర‌ప్ప‌న్ చంప‌డానికి చేసిన ఆప‌రేష‌న్ సంబంధిత వ్య‌క్తుల‌ను క‌లుసుకుని కొన్ని విష‌యాల‌ను సేక‌రించి వాటిలో నేను నిజ‌మ‌ని న‌మ్మిన దానిని బేస్ చేసుకుని సినిమా చేశాను. వీర‌ప్ప‌న్ గురించి చెప్పాలంటే అత‌ను పుట్టిందిపెరిగింది అంతా అట‌వీ ప్రాంతంలో త‌న‌కు  ఏ టెర్ర‌రిస్ట్  సంస్థ సపోర్ట్‌ లేదు. ఏ ఐడియాజీ లేదు. అతని ఆలోచనంతా జంతువు తరహాలో ఉంటుంది. తనకు ఎదురొచ్చేవారు అతనికి శత్రువుసపోర్ట్‌ చేస్తే మిత్రునే పంథాలోనే కొనసాగాడు. ఈ సినిమా వీరప్పన్‌కు సంబంధించిన బయోపిక్‌ కాదు.
  కర్ణాటకలో సీనియ‌ర్ న‌టుడు రాజ్‌కుమార్‌వీరప్పన్ మాత్రమే ఫేమస్‌. అలాంటి వాటిలో రాజ్‌కుమార్‌ను వీరప్పన్‌ కిడ్నాప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్‌ను యాక్ట్‌ చేయించడానికి ఒక కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.  వరల్డ్‌ హిస్టరీలో ఇలాంటి మనిషిని చూడలేదు. తనని పట్టుకోవడానికి మూడు రాష్ట్రా ప్రభుత్వం 700 కోట్ల రూపాయను ఖర్చు పెట్టింది. చివరకు ఓ మనిషికి వచ్చిన ఆలోచనే వీరప్పన్‌ అంతానికి మూమైంది. వీరప్పన్‌ మరణానికి ప్రధానపాత్ర పోషించిన పోలీస్‌ ఆఫీసర్‌ చేసిన పనున్నీ చూసినావిన్నా ఓ పోలీస్‌ ఆఫీసర్‌ ఇలాంటి పను చేయవచ్చునా అని కూడా అనిపిస్తుంది.  కానీ కొన్ని సందర్భాల్లో మనం సాధించే ఫలితమో ముఖ్యందాని కోసం ఏ మేథడ్స్‌ ఉపయోగించామో అవసరం లేదు. ఈ సినిమా చిత్రీకరణను చాలా వరకు వీరప్పన్‌ తిరిగిన రియల్‌ లోకేషన్స్‌లోనే చిత్రీకరించాం. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఆపరేషన్‌ కుకూన్‌లో పాల్గొన్న వ్యక్తును కుసుకుని వారి చెప్పిన  విషయాను విని రియాల్టీ ఫీలైన దాన్ని సినిమా రూపంలో తెరకెక్కించాను.ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ను పోషించిన సందీప్‌ భరద్వాజ్‌ చూడటానికి చాలా సాధారణంగానే ఉంటాడు. కానీ ముంబైకి చెందిన మేకప్‌మేన్‌ విక్రమ్‌ తనని వీరప్పన్‌గా చూపించడానికి చాలా కష్టపడ్డాడు. ఆ క్రెడిట్‌ అంతా విక్రమ్‌కే చెందుతుంది. డిసెంబర్‌4న ఈ చిత్రాన్ని తెలుగు,తమిళంకన్నడంలో విడుద చేస్తున్నాం’’ అన్నారు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment