.

.

amaira dastoor creazy in tollywood

టాలివుడ్ పై కన్నేసింది 

తాజాగా మరో బాలీవుడ్ భామ టాలీవుడ్‌లో జెండా ఎగరేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇషాక్ సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయమైన అమైరా దస్తూర్ ఈమధ్యే ధనుష్ సరసన తమిళంలో ‘అనేగన్’ సినిమాలో నటించింది. తెలుగులో ‘అనేకుడు’ పేరుతో విడుదలైన ఈ సినిమాతో మంచి మార్కులే కొట్టేసిన ఈ భామకు ఇపుడు టాలీవుడ్‌లో అవకాశాల వెల్లువ ఎక్కువైంది. తాజాగా మంచు విష్ణు హీరోగా రూపొందే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోందట. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాతోపాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో కూడా నటించేందుకు ఓకె చెప్పినట్టు తెలిసింది. మొత్తానికి అమైరా టాలీవుడ్‌లో మంచి స్పీడుతో దూసుకుపోతోంది. ఈమె స్పీడ్ చూస్తుంటే టాప్ హీరోయిన్లకు గట్టిపోటే ఇచ్చేట్టు కన్పిస్తోంది.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment