.

.

avasaraniko abaddam shooting complete

అవ‌స‌రానికో అబ‌ద్ధం షూటింగ్ పూర్తి


చ‌క్రం క్రియోష‌న్స్ మ‌రియు శ్రేయాస్ మీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రై లిమిటెడ్ సంయుక్తంగా రూపోందిస్తున్న చిత్రం 'అవ‌స‌రానికో అబ‌ద్ధం'. సురేష్ కె.వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ త‌న స్నేహితులు విజ‌య్‌.జె తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌తిమ‌నిషి అవ‌స‌రానికి ఖ‌చ్చితంగా అభ‌ద్దం ఆడితీర‌తారు అయితే అలా ఆడిన అభ‌ద్దం వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చింది అనే కాన్సెప్ట్ తో ఉత్కంఠ‌గా తెరకెక్కించారు. షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. ఈచిత్రం యెక్క టీజ‌ర్ అతిత్వ‌ర‌లో విడుద‌ల‌వుతుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి త్వ‌ర‌లో చిత్రాన్ని విడుద‌ల చేయటానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు.  ఈ సందర్భంగా నిర్మాత ద‌ర్శ‌కుడు సురేష్‌.కె.వి మాట్లాడుతూ.. ప్ర‌మోష‌న్ రంగంలో, నిర్మాణ రంగంలో ట్రెండ్ క్రియోట్ చేసిన శ్రేయాస్‌మీడియా వారితో మా 'అవ‌స‌రానికో అబ‌ద్ధం' చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ప్ర‌తి మ‌నిషి జీవితం లో ఎక్క‌డో అక్క‌డ అవ‌స‌రానికి అభ‌ద్దం ఆడి వుంటాడు. అదే మా చిత్రానికి టైటిల్ గా పెట్టుకున్నాం. వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఈచిత్రాన్ని నిర్మించాము. చిత్ర షూటింగ్ పూర్తిచేసుకున్నాం. పాప రూప‌శ్రి చాలా బాగా చేసింది.  త్వ‌ర‌లో ఆడియో టీజ‌ర్ ని విడుదల చేసి చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాము. అన్నారు.  

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment