.

.

mega heroyin title confarmed

మెగా హీరోయిన్ ఒక్క మనసు 
  
మెగా హీరోలు ఇప్పుడు టాలీవుడ్ లో తనదైన హవా చూపిస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రి ఇస్తుంది నాగబాబు తనయ నిహారిక ! ఇప్పటికే బుల్లితెర యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమె తాజాగా నాగ శౌర్య హీరోగా రూపొందే సినేమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టిన ఈ సినిమా షూటింగ్ ఈ నెల 16 నుండి జరగనుంది. పదహారు నుండి జరిగే షూటింగ్ లో నిహారిక పాల్గొననుందట !! మధుర శ్రీధర్ నిర్మించే ఈ చిత్రానికి మల్లెల తీరం లో సిరిమల్లె చెట్టు దర్శకుడు రామరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు ఒక్క మనసు అనే టైటిల్ ను ఓకే చేసేలా ఉన్నారు !!
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment