.

.

titanic movie start

 టైటానిక్ సినిమా ప్రారంభం 

రాజీవ్ సాలూరియామిని భాస్క‌ర్ హీరో హీరోయిన్లుగా  క‌న్నా సినీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నూత‌న చిత్రం టైటానిక్’. అంత‌ర్వేది టు అమ‌లాపురం ట్యాగ్ లైన్. ఈ చిత్రం బుధ‌వారం రాజ‌మండ్రిలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. జి.రాజ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో కె.శ్రీనివాస‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రాజమండ్రి కార్పొరేట‌ర్‌ మ‌డ‌పాక విజ‌య‌ల‌క్ష్మి జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేశారు. తొలి స‌న్నివేశానికి రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే బుచ్చ‌య్య‌చౌద‌రి క్లాప్ కొట్ట‌గారాజ‌మండ్రి మేయ‌ర్ పంతం ర‌జ‌నీ శేష‌సాయి కెమెరా స్విచ్చాన్ చేశారు. ముహుర్త‌పు స‌న్నివేశానికి  మ‌డ‌పాక విజ‌య‌ల‌క్ష్మిగౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా...స‌హ నిర్మాత అట్టూరి సురేష్‌బాబు మాట్లాడుతూ ‘’’టైటానిక్ చిత్రం ఫుల్ ప్యామిలీ కామెడి ఎంటర్‌టైన‌ర్‌. అంత‌ర్వేది నుండి అమ‌లాపురం వ‌ర‌కు గోదావ‌రి న‌దిలో టైటానిక్ అనే లాంచీలో జ‌రిగే క‌థే ఇది. పెళ్ళి బృందం కామెడితో సినిమా సరదాగా సాగుతుంది. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇందులో పెళ్ళి కొడుకుగా న‌టిస్తున్నాడు. రాజీవ్ సాలూరి హీరోగా న‌టిస్తున్నాడు. ర‌ఘుబాబు విల‌న్‌గా న‌టిస్తున్నాడు. అలాగే జ‌బ‌ర్‌ద‌స్త్ టీం కామెడి సినిమాకు ప్ల‌స్ అవుతుంది. సినిమా రెగ్యుల‌ర్ షూటిగంగ్ ఈరోజు నుండి స్టార్ట‌వుతుంది. 35రోజుల్లో చిత్రీకర‌ణ‌ను పూర్తి చేసి సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. రాజ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌కు వినోద్  యాజ‌మాన్య సంగీతం అందిస్తున్నారు’’  అన్నారు. 

Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment