.

.

డబ్బింగ్ లో కేడి బిల్లా కిలాడి రంగా


ప్రముఖ తమిళ దర్శకుడు పాండిరాజ్‌ (పసంగ ఫేం) దర్శకత్వం వహించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘కేడి బిల్లా-కిలాడి రంగా’ అదే పేరుతో తెలుగులో అనువాదమవుతుండడం తెలిసిందే. భీమవరం టాకీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మల్స్పల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఈ చిత్రంలో విమల్‌, శివకార్తికేయన్‌ హీరోలు కాగా.. రెజీనా, బిందుమాధవి హీరోయిన్లు. యువన్‌ శంకర్‌రాజా సంగీత సారధ్యం వహించారు. విజయదశమి పర్వదినాన ‘కేడి బిల్లా-కిలాడి రంగా’ డబ్బింగ్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘తమిళంలో సంచన విజయాలతో దూసుకుపోతున్న పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కేడి బిల్లా-కిలాడి రంగా’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకుకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఆడియో విడుద చేసి, నవంబర్‌ చివరివారంలో లేదా.. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment