.

.

నాన్నకు ప్రేమతో టీజర్ క్రేజీ


యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. ఈ చిత్రం టీజర్‌ విజయదశమి కానుకగా అక్టోబర్‌ 21 సాయంత్రం 6 గంటలకు విడుదలైంది. ఈ టీజర్‌కు ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో వ్యూస్‌, లైక్స్‌ లభించాయి. ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''విజయదశమి కానుకగా అక్టోబర్‌ 21 సాయంత్రం విడుదలైన 'నాన్నకు ప్రేమతో..' టీజర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఒక్కరోజులోనే ఈ టీజర్‌కు 1 మిలియన్‌ వ్యూస్‌ లభించడం విశేషం. అలాగే 25 వేల లైక్స్‌ కూడా రావడం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో వున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్‌ డిఫరెంట్‌గా లుక్‌తో కనిపించే ఈ చిత్రం టీజర్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. టీజర్‌ ఎక్స్‌ట్రార్డినరీగా వుందని, తప్పకుండా ఎన్టీఆర్‌ కెరీర్‌లో 'నాన్నకు ప్రేమతో..' పెద్ద హిట్‌ సినిమా అవుతుందని చెప్తున్నారు. నవంబర్‌ 1 నుంచి స్పెయిన్‌లో నెలరోజులపాటు ఓ భారీ షెడ్యూల్‌ చెయ్యబోతున్నాం. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment