.

.

విడుదలకు సిద్దమైన బుల్లెట్‌రాణి

    
   ఫోకస్‌ ఆన్‌ పిక్చర్స్‌ పతాకంపై.. సాజిద్‌ ఖురేషి దర్శకత్వంలో యం.యస్‌.యూసుఫ్‌ నిర్మిస్తున్న అవుట్  అండ్ అవుట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘బుల్లెట్‌రాణి’. డేర్‌ డెవిల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నిషా కొఠారి టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఆశిష్‌ విద్యార్ధి, రవి కాలే, తాగుబోతు రమేష్‌, షఫి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం అతి త్వరలో విడుద కానుంది. ఈ సందర్భంగా హైద్రాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో చిత్ర కథానాయకి నిషా కొఠారి, చిత్ర దర్శకులు సాజిద్‌ ఖురేషి పాల్గొని చిత్ర విశేషాలు వెల్లడించారు. ‘బుల్లెట్‌రాణి’ పాత్రకు నిషా కొఠారి పూర్తి న్యాయం చేసిందని.. ఆ పాత్రకు ఎంపిక చేసినప్పటి నుంచి దాదాపు రెండు నెలలు ఆ పాత్ర పోషణ కోసం ఆమె ఎంతో హోమ్‌ వర్క్‌ చేసిందని.. ఈ చిత్రం నిషా కొఠారి కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుందని చిత్ర దర్శకులు సాజిద్‌ ఖురేషి చెప్పారు. ఈ చిత్ర నిర్మాత యం.యస్‌.యూసుఫ్‌ తనకు మంచి మిత్రుడని.. తన మీద, తన కథ మీద గల నమ్మకంతో ‘బుల్లెట్‌రాణి’ చిత్రాన్ని తెలుగుతోపాటు, కన్నడ భాషలోనూ ఏకకాలం లో నిర్మించారని.. అవుట్‌పుట్‌ చూసుకొన్నాక ఆయన చాలా హ్యాపీగా పీవుతున్నారని సాజిద్‌ తెలిపారు. నవంబర్‌ ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. చిత్ర కథానాయకి నిషా కొఠారి మాట్లాడుతూ.. ‘బుల్లెట్‌రాణి’ ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూసినవాళ్లంతా నేను చాలా బాగా చేసానని మెచ్చుకొంటున్నారు. అయితే ఆ క్రెడిట్‌ మొత్తం డైరెక్టర్‌ సాజిద్‌ ఖురేషికే చెందుతుంది. నా క్యారెక్టర్‌ను అద్భుతంగా తీర్చి దిద్దారాయన. నాదనే కాదు.. ఈ చిత్రంలోని ప్రతి క్యారెక్టర్‌ను ఆయన అంతే శ్రద్దగా డిజైన్‌ చేసారు. ముఖ్యంగా.. ఇప్పటివరకు నేను చేసిన అన్ని సినిమాల్లోనూ.. ‘బుల్లెట్రాణి’ చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. నిర్మాణపరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వని మా నిర్మాత యం.యస్‌.యూసుఫ్‌గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను’ అన్నారు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment