.

.

అందరిని బయపెట్టే బేబీ


తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన "బేబీ" చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.  అందరూ కొత్త నటీనటులతో నూతన నిర్మాణ సంస్థలు విశ్వాస్ మీడియా మరియు మెంటార్ మూవీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ తెలుగు రికార్డింగ్ మరియు డబ్బింగ్ కార్యక్రమాలు విజయదశమి నాడు (అక్టోబర్ 22న) ప్రారంభమయ్యాయి. ప్రఖ్యాత దర్శకులు భారతీ రాజా తనయుడు మనోజ్ భారతీరాజా ఈ చిత్రంలో హీరోగా నటించడం విశేషం. అంజలిరావ్, శైరా గర్గ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో బేబి సతన్య, బేబి శ్రీవర్షిణి కీలకపాత్రలు పోషించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు  మాట్లాడుతూ... "తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన "బేబీ" చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువదిస్తున్నాం. డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కుడా అలరిస్తుందన్న నమ్మకంతోనే ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాం. ప్రఖ్యాత దర్శకులు భారతీ రాజా తనయుడు మనోజ్ భారతెరాజా ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించడం విశేషం. దసరా సందర్భంగా అక్టోబర్ 22న ఈ చిత్రం డబ్బింగ్ మరియు రికార్డింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టాం. డిసెంబర్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment