.

.

జనవరి నుండే గబ్బర్ సింగ్ 2

జనవరి నుండే గబ్బర్ సింగ్ 2



పవన్‌కళ్యాణ్ నటించే గబ్బర్‌సింగ్-2 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ కూడా పూర్తిచేసుకున్న గబ్బర్‌సింగ్-2 జనవరి మొదటి వారంలో సెట్స్‌పైకి రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం ‘గోపాల గోపాల’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయి జనవరి 14న విడుదలకు సిద్ధమవడంతో ఇక పవన్‌కళ్యాణ్ తన తదుపరి చిత్రంపై దృష్టిసారించారు. పవర్ దర్శకుడు బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ జనవరి మొదటి వారం నుండి జరగనున్నట్టు సమాచారం. పవన్ సరసన అనీషాఅంబ్రోస్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శరత్‌మరార్ నిర్మిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక వార్తలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment