.

.

బాహుబలి లో తమన్నా

బాహుబలి లో తమన్నా



ఎస్.ఎస్.రాజవౌళి ప్రతిష్టాత్మకంగా ప్రభాస్ కథానాయకుడుగా రూపొందిస్తున్న జానపద చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రంలో అనేకమంది తారలు నటిస్తూ మల్టీస్టారర్ చిత్రంగా ఇప్పటికే చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమాలో తమన్నా అవంతిక పాత్రలో నటిస్తోంది. తమన్నా ఫస్ట్‌లుక్‌ను ఆమె జన్మదినోత్సవ సందర్భంగా విడుదల చేశారు. ఇప్పటికే తమన్నా ఫస్ట్‌లుక్‌కు సామాజిక మీడియాలలో మంచి ఆదరణ లభిస్తోంది. నెగిటివ్ షేడ్స్‌తో ఆమె నటిస్తున్న అవంతిక పాత్రకోసం, తమన్నా బల్గేరియాలో ప్రభాస్‌తో కత్తి యుద్ధాలను చేస్తోంది. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు. ఈ చిత్రాన్ని 2015 వేసవి కానుకగా ప్రపంచమంతటా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. షోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందిస్తుండడం విశేషం.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment