.

.

ప్రతి ఒక్కరికీ నచ్చేలా - దర్శకుడు కరుణాకరన్

ప్రతి ఒక్కరికీ నచ్చేలా - దర్శకుడు కరుణాకరన్


ప్రేమకథ చిత్రాలకు పెట్టింది పేరు కరుణాకరన్. ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా అంటే చాలు ఓ కొత్త ప్రేమకథను ఆవిష్కరిస్తారనే నమ్మకంతో థియేటర్‌కు వస్తారు ప్రేక్షకులు. తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చిన్నదాన నీకోసం’. నితిన్, మిస్తి చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రం గురువారం విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ- ఎప్పటినుంచో నితిన్‌తో సినిమా చేయాలని అనుకున్నాను. అది ఇన్నాళ్ళకి కుదిరింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇక ఈ కథ గురించి చెప్పాలంటే, సినిమాలో మన పక్కింటి కుర్రాడిలా నితిన్ నటించాడు. తను పవన్‌కళ్యాణ్ అభిమాని. ప్రేమలో పడ్డ అబ్బాయి ఎలా తన ప్రేమను గెలుచుకున్నాడనే కథే ఈ చిత్రం. ఈ సినిమా క్లైమాక్స్‌లో అందరినీ సర్‌ప్రైజ్ చేసే ఒక ఎలిమెంట్ ఉంటుంది. తప్పకుండా అది ప్రేక్షకులకు నచ్చుతుంది. మంచి ప్రేమకథతోపాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నచ్చేలా అన్ని అంశాలు ఉంటాయి. తప్పకుండా నితిన్‌కు ఈ సినిమా మరో మంచి హిట్‌గా నిలుస్తుంది అన్నారు.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment