.

.

రంగంలోకి దిగుతున్న యంగ్ టైగర్ ?

NTR re entry? 


ప్రస్తుతం రభస షూటింగ్ లో ఉన్న ఎన్టిఆర్ ఆ తరువాత సుకుమార్ దర్శకత్వం లో నటించాల్సి ఉంది . అయితే రానున్న ఎన్నికలకు టిడిపి తరపున ప్రచారం చేయడానికి రెడీ అయినట్టు తెలిసింది .  ఎన్‌టిఆర్ కొంతకాలంగా తెలుగుదేశం పార్టీతో దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే . కానీ  పార్టీ గురించి ఎప్పుడు మీడియా అడిగినా తాతగారు స్థాపించిన పార్టీతోనే ఉంటా అంటూ చెప్తూ వస్తున్నాడు. అయితే  కొన్ని రోజులుగా మావయ్య చంద్రబాబు, బాబాయ్ బాలకృష్ణ ఇద్దరితోనూ మాటల్లేవ్ అని తెలిసింది ? అయితే ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి  రాబోయే ఎన్న్నికల్లో పార్టీ ప్రచారానికి రెడీ అయ్యాడని విశ్వసనీయ సమాచారం.
దానికోసం  20 రోజుల డేట్స్ కూడా అడ్జెస్ట్ చేసినట్టు , అందులో బాగంగా సీమంద్ర , తెలంగాణా రెండు రాష్ట్రాల్లో పార్టీ కోసం ప్రచారం చేస్తాడని పొలిటికల్ వర్గాల సమాచారం . గతం లో కుడా ఎన్టిఆర్ టిడిపి కి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే ?  అయితే ఈ విషయం వెనుక టిడిపి రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది ?
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment