.

.

సెట్స్ పైకి చిరంజీవి 150 వ చిత్రం ?


గత కొన్ని రోజులుగా సినిమాలకు పులి స్టాప్ పెట్టి రాజకీయ [ప్రవేశం చేసిన మెగా స్టార్ ఇటివల జరిగిన ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయారు . రాష్ట్రం లో  కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవ్వడంతో ఆయన మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి . గత కొంత కాలంగా ఊరిస్తున్న తన 150వ సినిమాను పూర్తి చేస్తాడని  వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆయనను తమిళ ప్రముఖ దర్శకుడు మణిరత్నం సంప్రదించాడని , వీరి కలయికలో ఓ సినిమా రూపొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది . దాంతో పాటు మరో ప్రాజెక్ట్ కుడా ఉంటుందని సమాచారం ? అయితే ఈ మెగా స్టార్ చేసే సినిమా  ఎలా ఉంటుంది ? ఆయన ఎలాంటి పాత్రలో నటించబోతున్నాడు ? అనే అంశం ఇప్పుడు మెగా అభిమానుల్లో నెలకొంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం అయన  ఓ విప్లవ వీరుని పాత్రలో బ్రిటిష్ కాలం నాటి కథతో నటిస్తాడని సమాచారం . తెల్లదొరల చేతిలో ఉరిశిక్షకు గురైన రాయలసీమ పోరాటయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ’ చరిత్రను తెరకెక్కించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది .  ఈ చిత్రం మెగా స్టార్  బర్త్ డే (ఆగష్టు 22)న ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారనీ సమాచారం. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తాడని వార్తలు వస్తున్నాయి . అయితే చిరు లేటెస్ట్ గా దర్శకుడు  విక్రం కుమార్ తో కుడా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది . మరి చిరు 150 చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో ... ?? 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment