Shriya in trouble ?
ప్రస్తుతం సౌత్ లో చెప్పుకోదగ్గ సినిమాలు లేని శ్రియకు లేటెస్ట్ గా ఓ టాలీవుడ్ నిర్మాత షాక్ ఇచ్చాడు. అదేమిటంటే ఆమె పరిహారంగా కోటి రూపాయలు ఇవ్వాలని కండిషన్ పెట్టాడట. ఇంతకి వివరాలు ఏమిటంటే శ్రేయ వేశ్య పాత్రలో నటించిన పవిత్ర సినిమా బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడంతో, ఇక పై అలంటి పాత్ర చేయకూడదని, నిర్ణయించుకుంది. అయితే ఆ సమయంలో అలంటి తరహా చిత్రం లో నటించడానికి శ్రేయ అడ్వాన్స్ కుడా తీసేసుకుందట. అయితే పవిత్ర మూవీ బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడంతో,ఆ ప్రాజెక్ట్ను క్యాన్సిల్ చేయాల్సిందిగా నిర్మాతకు చెప్పింది. అయితే ఆ నిర్మాత మాత్రం ఇప్పుడు కుదరదంటూ, లేదంటే దానికి కోటి రూపాయల వరకూ ఫైన్ చెల్లించాలంటూ చెప్పాడట. దీంతో శ్రేయా ఈ సెటిల్మెంట్ను సినీపెద్దల వద్ద తేల్చుకుందాం అంటూ నిర్మాతకు సవాల్ విసిరి వెళ్ళిందట.
0 comments:
Post a Comment