.

.

వర్మ కొత్త హీరోయిన్ ?

Varma new lukky heroyin?


అందాల ప్రదర్శనలో తనదైన స్టైల్ ని చూపించే వర్మ హీరోయిన్లు  ఎలాంటి సంచలనాలు సృష్టించారో అందరికి తెలిసిన విషయమే. అలాంటి మరో అందాల భామ గా  ఇప్పుడు వర్మ కు కొత్త హీరోయిన్ దొరికింది.  ఎప్పటికప్పుడు కొత్త అందాలతో తన సినిమాలను అప్ డేట్ చేసే వర్మ. గతం లో ఊర్మిళ‌, నిషాకొఠారీ, ఆంత్రమాలీ, న‌థాలియా కౌర్‌, మధుశాలిని, అనైకా సొథి ఇలా కొత్తందాల‌ను వెండితెరపై  ఆవిష్కరించ‌డంలో సిద్దహ‌స్తుడైన వ‌ర్మ చూపు ఇప్పుడు స్వాతి దీక్షిత్ మీద పడింది. ఇప్పుడిప్పుడే  టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కు కుంటున్న స్వాతి. బ్రేకప్ అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో  న‌టిస్తోంది. ఈమె అందాన్ని చూసిన వ‌ర్మ తాను తీయ‌నున్న `ప‌ట్ట‌ప‌గ‌లు` సినిమాకోసం బుక్ చేసుకొన్నార‌ట‌. ఇప్పటికే స్వాతిపై కొన్ని ఫొటో షూట్‌ని నిర్వహించాడ‌ట‌ వ‌ర్మ.  మ‌రి  ఈ దెబ్బతో స్వాతి జాతకం మరిపోయినట్టే అని అందరు అనుకుంటున్నారు.   
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment