.

.

రామ్ చరణ్ మరో బాలీవుడ్ సినిమా ?

Ram charan another bollywood movie?


రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ఎవడు జనవరి 12 న విడుదలకు సిద్దమవుతుండగా, మరో వైపు బాలీవుడ్ లో తన రెండవ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. అలాగే కృష్ణవంశి సినిమా కూడా జనవరిలో సెట్స్ పైకి రానుంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ లోకి జంజీర్ తో అడుగుపెట్టిన చెర్రీ కి ఆ సినిమా అపజయాన్ని ఇచ్చింది. అయితే  నటుడిగా మంచి గుర్తింపే సాదించాడు. గతం లో  ‘లగాన్’, ‘స్వదేశ్’ వంటి హిందీ సినిమాల దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఒక  చారిత్రాత్మక సినిమాను తెర‌కెక్కించబోతున్నాడు. ఈ మూవీలో చ‌ర‌ణ్‌  లీడింగ్ రోల్ లో నటిస్తాడని,  రీసెంట్‌గా ఈ సినిమాకు సంబందించిన చ‌ర్ఛలు కూడా జ‌రిగాయ‌ని టాలీవుడ్‌ సమాచారం.  ఈ మూవీలో దీపికా పదుకునే హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం ఉంది. 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment